సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని హనుమంతరావు పేటలో గత 100 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లే చాలా వరకు కనిపిస్తాయి. ఆ కట్టడాలు కూడా పూర్తిగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కడుతున్న ఇళ్లు కావచ్చు.. బ్రిడ్జిలు కావచ్చు.. కట్టిన కొన్ని సంవత్సరాల్లోనే శిథిలావస్థకు చేరుతున్నాయి. అయితే ఇక్కడ ఇళ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉండటమే కాదు.. ఎండాకాలంలో చల్లగా.. వానా కాలంలో వెచ్చగా ఉంటాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి