హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని బహదూర్‌గూడలో ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ కోసం 796.28 ఎకరాల భూమిని సేకరించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్–ముంబయి, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై వయా అమరావతి కారిడార్ల కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్‌లో రైలు, విమాన, రోడ్డు రవాణాను అనుసంధానించే కీలక కేంద్రంగా ఇది మారనుంది.