Totapuri Mango Farmers Rs 281 Crores: తోతాపురి మామిడి రైతులకు మద్దతుగా కనీస మద్దతు ధరలో లోటును చెల్లించేందుకు రూ.281 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తోతాపురి మామిడికి ధర లోటు చెల్లింపును అమలు చేయాలని ఉద్యానశాఖ ప్రభుత్వాన్ని కోరింది. మొత్తం 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి ఉత్పత్తికి కిలోకు రూ.4 చొప్పున ధర లోటు చెల్లించనున్నారు. నిధుల సమీకరణ, అవసరమైన తదుపరి చర్యలను ఏపీ మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.