Tg Tourism Department Tirumala Package: తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నుండి ఒక్కరోజులోనే తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 7 గంటలకు బయలుదేరి, దర్శనం అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకునేలా రూపొందించారు. ఈ ప్యాకేజీ ధర రూ.12,499 కాగా, రెండు రోజుల ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.