Patancheru Chemical Factory Blast: హైదరాబాద్ శివారు ప్రాంతమైన.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కార్మికుల్ని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ పేలుడుతో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఆర్పుతున్నారు.. అక్కడ దట్టంగా పొగలు కమ్మేశాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.