హైదరాబాద్ మెట్రో.. స్టేషన్లను ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌లు, కో వర్కింగ్ హబ్‌లు, శాటిలైట్ కార్యాలయాలుగా అభివృద్ధి చేస్తోంది. ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ వ్యూహంలో భాగంగా 3 కారిడార్లలోని 57 స్టేషన్లలో ఆఫీస్ స్పేస్‌లను గుర్తించింది. జేబీఎస్ స్టేషన్‌లో ఇప్పటికే కోహోర్ట్ కో వర్కింగ్ సెంటర్, గోల్డెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం పనిచేస్తున్నాయి. ఈ ఆఫీస్ బబుల్స్‌తో ఉద్యోగుల ప్రయాణ దూరం, ట్రాఫిక్ రద్దీ, రవాణా ఖర్చులు తగ్గి ప్రజారవాణా వినియోగం పెరగనుంది.