హైదరాబాద్ మెట్రోపై.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఏమన్నారంటే..

1 month ago 6
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ సంస్థ నుండి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ బదిలీకి సంబంధించిన ఒప్పందాలు పూర్తయితేనే రెండో దశ పనులపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. మెట్రో అభివృద్ధి కోసం ఏర్పాటు చేయాల్సిన సంయుక్త కమిటీకి రాష్ట్రం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను వెంటనే ప్రతిపాదించాలని కోరారు.
Read Entire Article