హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ప్రాంతంలో 726 గజాల ప్రభుత్వ స్థలం గజానికి రూ.2,47,500 చొప్పున అమ్ముడుపోయింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.17.96 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ప్రభుత్వ స్థలాలకు స్పష్టమైన యాజమాన్య పత్రాలు, వివాదాలు లేకపోవడం దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.