హైదరాబాద్‌లో 48 కేజీల బంగారు గణేషుడు.. వజ్రాలతో అలంకరణ

3 hours ago 3
హైదరాబాద్‌ బేగంబజార్‌ పరిధిలోని ఫీల్‌ఖానాలో ఏర్పాటు చేసిన 48 కిలోల బంగారు గణేశుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షల అమెరికన్‌ డైమండ్స్‌, 24 క్యారెట్ల బంగారు పూతతో విగ్రహాన్ని రూపొందించారు. లాల్‌బాగ్చా రాజా, తిరుమల బాలాజీ రూపాల నుంచి ప్రేరణతో దీన్ని తీర్చిదిద్దారు. మరోవైపు నాసిక్‌లోని ఓ స్వీట్స్‌ షాప్‌లో 24 క్యారెట్ల బంగారు పూతతో గోల్డెన్‌ మోదకాలు విక్రయిస్తున్నారు. కిలో ధర రూ.27 వేలు కాగా... ఈ ప్రత్యేక మోదకాలు, వాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Entire Article