అతి వేగంతో మలుపు తిరిగిన ఆర్టీసీ బస్సు.. వాహనాలపై కూలిన భారీ వృక్షం

1 day ago 2
హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ మూలమలుపు వద్ద సిరిసిల్ల డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు మలుపు తిరిగే సమయంలో విద్యుత్‌ వైర్లు చుట్టుకోవడంతో సమీపంలోని భారీ వృక్షం నేలకూలింది. చెట్టు కూలడంతో అక్కడ పార్క్‌ చేసిన రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. బస్సు అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ట్రాఫిక్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
Read Entire Article