హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా.. రెండో దశ ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి సర్కార్ వడి వడిగా అడుగులు వేస్తోంది. రెండో దశలో మొత్తం ఆరు కారిడార్లలో మెట్రో విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించగా.. ఇప్పటికే ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి.. కేంద్రానికి కూడా ప్రభుత్వం పంపించింది. అయితే.. ఈ రెండో దశ ప్రాజెక్టులో.. డబుల్ డెక్కర్, అండర్ గ్రౌండ్ మెట్రో మార్గాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలివిగో..!