హైదరాబాద్ శివార్లలోని కొండమడుగు, మౌలాలి పారిశ్రామిక ప్రాంతాల్లో ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ సాగిస్తున్న అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. నాగ్‌పూర్‌కు చెందిన ముఠా కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గుజరాత్‌లోని వల్సాద్ నుంచి రసాయనాలను సేకరించి తప్పుడు లేబుళ్లతో హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ తయారీకి రసాయనాలు సరఫరా చేస్తున్న వ్యాపారిని అరెస్టు చేయగా.. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.