హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో కొత్త వంతెన.. ఈ ఏరియాలోనే, ఈ నెలాఖరులో ప్రారంభం

1 hour ago 2
హైదరాబాద్‌ మూసారాంబాగ్‌-అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై నిర్మిస్తున్న కొత్త వంతెన పనులు దాదాపు పూర్తయ్యాయి. సుమారు రూ.52 కోట్ల వ్యయంతో 220 మీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మిస్తున్నారు. పక్కనే ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరడంతోపాటు భారీ వర్షాలు, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ గేట్ల ఎత్తివేత సమయంలో వరద నీరు దానిపై నుంచి ప్రవహించేది. కొత్త వంతెనను మరింత ఎత్తులో నిర్మించడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ నెలాఖరులో వంతెనను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article