సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో జరిగిన అక్రమాలు బయట పడిన తర్వాత పోలీసులు సరోగసి, ఐవీఎఫ్ సెంటర్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే పలు కేంద్రాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సరోగసి దందాను పోలీసులు బయటపెట్టారు. ఈ దాడుల్లో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాదు.. సరోగసి, ఐవీఎఫ్ ప్రాసెస్‌కు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు లేని జంటలను టార్గెట్ చేసుకొని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.