హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 2025లో మంచి వృద్ధిని సాధించింది. ముఖ్యంగా రూ. కోటి పైబడిన ప్రీమియం ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2025లో ఈ సెగ్మెంట్ ఇళ్ల రిజిస్ట్రేషన్లలో 35 శాతం పెరుగుదల కనిపించింది. ప్రీమియం ఇళ్లకు ఎంత డిమాండ్‌కు ఉందో దీన్ని బట్టి అర్థం అవుతోంది. కాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025 డిసెంబర్‌లో మొత్తం రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ల విలువ 23 శాతం పెరిగింది. ఇక మొత్త రిజిస్ట్రేషన్లు 14 శాతం పెరిగాయి.