హైదరాబాద్‌లో ఇల్లు లేదా స్థలాలు అమ్మేవారు బ్రోకర్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో లేదా విదేశాల్లో ఉండేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. బ్రోకర్లు కొనుగోలుదారుల ముసుగులో వచ్చి.. కొంత అడ్వాన్స్ ఇచ్చి అమ్మకపు ఒప్పందం చేసుకుంటారు. ఆ తర్వాత మిగిలిన సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేస్తూ.. యజమాని వేరే ఎవరికీ ఆ ఆస్తిని అమ్మకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడ్డుకుంటారు. ఇలా యజమానులను మానసికంగా వేధించి, చివరికి తక్కువ ధరకే ఆస్తిని దక్కించుకుంటారు.