తెలంగాణ ప్రభుత్వం 'విజన్-2047' ముసాయిదాను రూపొందిస్తోంది. దీని ముఖ్య లక్ష్యం.. రాష్ట్రంలోని 90 శాతం మంది ప్రజలు ఎక్కడి నుంచైనా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుని కేవలం 2 గంటల్లో చేరుకునేలా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం. ఇందులో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్ రీజియన్లను కలిపేందుకు కొత్త రోడ్లు, రైల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తారు. ప్రజారవాణాలో భాగంగా మెట్రో, ఎంఎంటీఎస్, ఎలక్ట్రిక్ బస్సులు, పాడ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టి, అన్నింటికీ కామన్ మొబిలిటీ కార్డ్ తీసుకురావాలని ప్రణాళిక చేస్తున్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి కూడా ఈ విజన్‌లో భాగం.