హైదరాబాద్ సరూర్‌నగర్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జీల పేరుతో హాస్పిటల్ పర్మిషన్ తీసుకున్న ఓ డాక్టర్ గుట్టుగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి ఒక్కో కిడ్నీ రూ. 55 లక్షల చొప్పున అవసరమైన వారికి అమ్మేసి కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, పోలీసులు ఆసుపత్రిపై దాడి చేసి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.