Ration Card Scam in Hyderabad: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఊపందుకుంది. అయితే, కొందరు దీన్ని అదునుగా తీసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు కావాలంటే వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారట. ఈ దందా వెనుక మీ సేవా కేంద్రాల నిర్వాహకుల హస్తం ఉందని సమాచారం. పేదలు మాత్రం డబ్బుల్లేక రేషన్ కార్డుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో ఈ తరహా వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వివరాలు..