హైదరాబాద్ నగరం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నందున ప్రధాన మౌలిక సదుపాయలతో పాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు H-CITI ప్రణాళిక అమలుచేస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మెుత్తం 7,032 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.