హైదరాబాద్‌లోని ప్రేమావతిపేటలో సాహిల్ ఫుడ్స్‌కు చెందిన ఐదు తయారీ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో నాలుగు యూనిట్ల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేశారు. కల్తీ అనుమానంతో 11 నమూనాలు సేకరించగా.. నిబంధనలకు విరుద్ధమైన లేబులింగ్‌తో ఉన్న 55 టన్నుల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.33.94 లక్షలుగా అంచనా వేశారు. అపరిశుభ్రత, నేలపై ఆహార నిల్వ, సిబ్బంది నిర్లక్ష్యాన్ని అధికారులు గుర్తించారు.