Delhi old vehicles in Hyderabad: ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు కఠినం కావడంతో, అక్కడ తక్కువ ధరలకే లభించే పాత వాహనాలు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్నాయి. తక్కువ ధరకే లగ్జరీ కార్లు వస్తుండటంతో నగరవాసులు ఎగబడుతున్నారు. అయితే, ఈ పాత వాహనాలు అధిక కాలుష్యాన్ని వెదజల్లుతూ నగర వాయు నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. కాలం చెల్లిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్క్రాపేజ్ పాలసీపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.