హైదరాబాద్‌లోని ఘట్కేసర్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారులో రన్నింగ్‌లో ఉండగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. కారు పక్కకు ఆపేలోపు.. పూర్తిగా మంటలు వ్యాపించటంతో.. లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. స్థానికులు, పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. అందులో ఉన్న ఇద్దరినీ కాపాడలేకపోయారు.