భర్త ఇంటిలో లేని సమయంలో ప్రియుడితో గడుపుతుండగా తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడని రెండేళ్ల కొడుకుని హత్య చేసిందో ఇల్లాలు. బాబు ఏడుస్తుండటంతో చిరాకు పడిన ప్రియుడు.. వాడ్ని చంపేద్దామని చెబితే.. కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ మహిళ దారుణానికి ఒడిగట్టింది. కుమారుడ్ని నేలకేసి కొట్టి చంపి, చివరకు ఫిట్స్ వచ్చి చనిపోయాడని భర్తకు అబద్దం చెప్పి నమ్మించింది. కానీ, చివరకు ఆమె పాపం పండి భర్త నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.