హైదరాబాద్‌లో నోటరీ స్థలాలకు నిర్మాణ అనుమతులు ఇవ్వకపోవటంపై జీహెచ్‌ఎంసీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య వెనుక నోటరీ ఇంటి సీజ్ కారణమని కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్య ప్రణాళికాధికారి స్పందిస్తూ.. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉన్న స్థలాలకు మాత్రమే అనుమతి అని స్పష్టం చేశారు. నోటరీ స్థలాలకు నిర్మాణ అనుమతులు ఇవ్వలేమన్నారు.