హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతున్నట్లు ప్రత్యేక ఆపరేషన్‌లో గుర్తించారు. దీంతో 11 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ మెడికల్ డిగ్రీ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స, మందులు, ఇంజెక్షన్లు అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరికి ఫేక్ సర్టిఫికెట్లు ఎవరు సమకూర్చారు.. ఎంతకాలంగా ఈ దందా కొనసాగుతోంది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.