హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఫేక్ నెంబర్ ప్లేట్‌లపై దృష్టి సారించారు. నకిలీ నెంబర్ల వాహనాలు వినియోగిస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత 8 నెలల్లో ఇప్పటికే 100 మందికిపైగా క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. 88 టూ వీలర్స్‌ని 12 కార్లను కూడా సీజ్ చేశారు. ఈ సందర్భంగా నకిలీ నెంబర్లను వాడితే నేరమని, చట్ట రీత్యా చర్యలు తీసుకుటామని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు తెలియజేశారు. అలాగే HSRP నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.