సింగరేణి ఎగ్జిక్యూటివ్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. తమకు మహారత్న సంస్థ ప్రభుత్వ రంగ కోల్-ఇండియా తరహా వేతనాలను అందజేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి దీనిపై ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సిఫార్సులను పరిశీలించిన అనంతరం వేతన సిఫార్సులకు ఆమోదం తెలిపారు. దీంతో లెవెల్ 1 నుంచి 7 వరకు ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరగున్నాయి. ఈ పెంపు నిర్ణయం సెప్టెంబరు 25 నుంచి అమల్లోకి వస్తుంది.