హైదరాబాద్‌లో మరోసారి భూములు వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మూసాపేట, బంజారాహిల్స్, కొండాపూర్‌లో మొత్తం 42 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా సుమారు రూ. 5 వేల కోట్లు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికి సంబంధించి హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే గతంలో హైదరాబాద్‌లో జరిగిన భూముల వేలాల్లో రికార్డు ధరలు పలికాయి. దీంతో ఈసారి కూడా భారీ స్పందన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.