New Event Ground in Hyderabad: హైదరాబాద్‌లో మరో అత్యాధునిక ఈవెంట్ గ్రౌండ్ సిద్ధమవుతోంది. పీపుల్స్ ప్లాజా తరహాలోనే, బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ప్రసాద్ మల్టీప్లెక్స్ మధ్యలో మూడు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.4 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. రాజకీయ, సాంస్కృతిక, వాణిజ్య ప్రదర్శనలకు అనువుగా ఉండే ఈ మైదానాన్ని హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ కొత్త వేదిక అద్దె.. పీపుల్స్ ప్లాజా కంటే ఎక్కువగా ఉండనుంది.