హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌.. ఈ మార్గంలోనే, నిర్మాణానికి టెండర్లు

1 hour ago 1
హైదరాబాద్ వాహనదారులకు తీపి కబురు. త్వరలోనే మరో ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. బంజారాహిల్స్‌–గచ్చిబౌలి మధ్య ప్రతిపాదించిన 9 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌కు హెచ్‌ఎండీఏ టెండర్లు పిలిచింది. సెప్టెంబర్‌ 22లోపు ఆన్‌లైన్‌ బిడ్లు స్వీకరించనున్నారు. రూ.1,656 కోట్ల అంచనా వ్యయంతో డీబీఎఫ్‌ఓటీ విధానంలో ప్రాజెక్టును చేపట్టనున్నారు. రెండు దశల్లో ఫిలింనగర్‌– శిల్పా లేఅవుట్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌– హకీంపేట్‌ కుంట మార్గాల్లో నిర్మాణం జరగనుంది. ఆరు కీలక ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌ ర్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌ మెట్రో విస్తరణకు అనుగుణంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ డిజైన్‌ చేస్తున్నారు.
Read Entire Article