వరంగల్-కరీంనగర్ మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసే ఎన్‌హెచ్-563 నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.1,641 కోట్ల అంచనా వ్యయంతో 68.015 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారిపై ప్రస్తుతం వాహనాల ట్రయల్‌రన్ కొనసాగుతోంది. కొత్త రహదారి అందుబాటులోకి వస్తే గతంలో గంటన్నర వరకు పట్టిన వరంగల్-కరీంనగర్ ప్రయాణం సుమారు 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో లేదా దసరాలోపు రహదారిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.