రామప్ప ఆలయానికి మైనింగ్ ముప్పు.. 3 టీఎంసీల రామప్ప చెరువుకూ ప్రమాదమేనా?

1 hour ago 1
ములుగు జిల్లాలో ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల ప్రాజెక్టుపై స్థానికులు, పర్యావరణవేత్తలు, వారసత్వ పరిరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయంతో పాటు 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రామప్ప చెరువుపై మైనింగ్ ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ప్రతిపాదిత ప్రాజెక్టు జియో ట్యాగింగ్ ప్రక్రియను వాయిదా వేశారు. శాస్త్రీయ, పర్యావరణ అధ్యయనాల అనంతరం నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Read Entire Article