జనసేన జెండా పట్టుకున్నప్పుడే తాను యుద్ధానికి సిద్ధమై వచ్చానని సినీ నటుడు తనీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కొన్ని రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్, అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తున్నాయని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన ఓ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంత్రి సీతక్క గురించి మాట్లాడుతున్నావంటూ తనను హెచ్చరించినట్లు ఆ మెసేజ్‌లో ఉందని తెలిపారు. తనను రెచ్చగొడితే ఇసుక అక్రమ రవాణా, కమిషన్లు, కాంట్రాక్టుల వ్యవహారాలపై మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.