ఏపీలోని రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. 2027 మార్చికల్లా రైతుల భూసమస్యలు అన్నీ పరిష్కరిస్తామని కోనసీమ జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు. పి. గన్నవరం నియోజకవర్గంలోని మాచవరంలో జరిగిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని.. మార్చి కల్లా 56 లక్షల మందికి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేశారు.