మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. కుమార్తె సిరి సహస్రతో పాటు మజ్జి శ్రీనివాసరావు సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అయితే విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి సంబంధించి సిరి సహస్ర, బొత్స కుమార్తె అనూష మధ్య పోటీ ఏర్పడిందని.. దీంతోనే చిన్న శ్రీను టీడీపీలో చేరారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర క్లారిటీ ఇచ్చారు.