సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం మరో భారీ పెట్టుబడిని రాబట్టింది. ప్రముఖ కంపెనీ అయిన.. ఎస్టీ టెలీ మీడియా గ్లోబర్ సంస్థ.. హైదరాబాద్ నగరంలో మరో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం.. రూ.3500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు.. అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్.. అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.