హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. జర్మనీకి చెందిన ఓ విదేశీ యువతిపై సాముహిక అత్యాచారం జరిగింది. మీర్‌పేట మంద మల్లమ్మ వద్ద లిఫ్ట్ పేరుతో యువతిని కారులో ఎక్కించుకున్న ముగ్గురు యువకులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.