హైదరాబాద్‌లోని కోకాపేటలో మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. నియోపోలిస్ లేఅవుట్‌కు సమీపంలో ఉన్న 70 ఎకరాల భూమిని జనవరి రెండో వారంలో వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా రూ. 800 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇక్కడ ఎకరం రూ. 143 కోట్ల వరకు పలికింది.