హైదరాబాద్‌లో అరుదైన పశువైద్య శస్త్రచికిత్స విజయవంతమైంది. తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతున్న కుక్కకు చేప చర్మం అంటుకట్టి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఈ వినూత్న చికిత్స ద్వారా కుక్క ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుంది. పశువైద్య రంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా నిలిచింది.