దొంగతనాల్లో కొన్ని వింతగా అనిపిస్తాయి. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ డీమార్ట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఖరీదైన ఇలాచీ (యాలకులు) ప్యాకెట్లను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. డీమార్ట్‌లో ఇలాచీ ప్యాకెట్లు మాయమవుతుండటంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. దీపక్‌కుమార్ అనే వ్యక్తి ప్యాకెట్లను వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి లోదుస్తుల్లో దాచుకుని వెళుతున్నట్లు గుర్తించారు. మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండగా.. సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వింత దొంగతనం స్థానికంగా నవ్వులు పూయించింది.