Kukatpally housing board Plots For Sale: హైదరాబాద్‌లో సొంతిళ్లు అనేది చాలా మంది ఉద్యోగుల చిరకాల కోరిక. ఇందుకోసం చాలా మంది పైసా పైసా కూడబెట్టుకుంటుంటారు. గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కోవాలని కొందరనుకుంటే.. మంచి వాతావరణంలో స్థలం కొనుక్కుని కలల సౌధాన్ని నిర్మించుకోవాలని మరికొందరు ఆశిస్తుంటారు. అలాంటి వారి కోసం అధికారులు మంచి అవకాశం తీసుకొచ్చారు. నగరంలోని హౌసింగ్ బౌర్డు స్థలాలను అమ్మేందుకు సిద్ధమయ్యారు. బహిరంగంగా వేలం వేసేందుకు నిర్ణయించారు.