మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో కేసులు నమోదైన వారిని ఇటీవల కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో 270 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. దీంతో వారి వివరాలను కార్యాలయాలకు, కాలేజీలకు పంపించాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని పోలీసులు భావిస్తున్నారు.