Free Food in Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల హడావుడి ప్రారంభమైంది. వినాయక చవితి తర్వాత మూడో రోజు నుంచే గణేషుల నిమజ్జన ప్రక్రియ మొదలైంది. అయితే.. సెప్టెంబర్ 17న మహగణపతి నిమజ్జన కార్యక్రమానికి నగరం సిద్ధమైంది. ఈ క్రమంలో.. జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని.. కమిషనర్ ఆమ్రపాలి కాటా స్పష్టం చేశారు. అయితే.. నిమజ్జనానికి వచ్చే భక్తులకు నీళ్లతో పాటు భోజనం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా ఆమ్రపాలి తెలిపారు.