MMTS Special Trains:హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం అంటే.. మామూలుగా ఉండదు. నగరం నగరమంతా ట్యాంక్ బండ్ మీదే ఉంటుంది. ఇసుకేస్తే రాలనంతా జనమంతా ట్యాంక్ బండ్ మీదికి చేరుకుని.. గణేషున్ని గంగమ్మ ఒళ్లోకి సాగనంపుతుంటారు. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు కేవలం నగరవాసులే కాదు.. వేరే జిల్లాల నుంచి కూడా విచ్చేస్తుంటారు. అయితే.. నిమజ్జనం రోజున ప్రజల రవాణా సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట కూడా ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది.