హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రి పనులు తుది దశకు చేరుకున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 1000 పడకల సామర్థ్యంతో, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పేదలకు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిని.. ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రిలో అత్యవసర, ప్రత్యేక వైద్య సేవలు ఉచితంగా అందనున్నాయి. ఇవే కాకుండా మరో మూడు టిమ్స్ ఆసుపత్రుల పనులు కూడా వేగంగా సాగుతున్నట్లు సమాచారం.