రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్న హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రహదారిని 4 నుంచి 6 వరుసలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అయితే ఈ రహదారి విస్తరణపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 40 కి.మీ రహదారిని విస్తరించాలని డిసైడ్ అయింది.