హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ దంపతులను ఢీకొనడంతో వెంకటేష్, లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. పాదాచారుల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.