హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. ఓఆర్‌ఆర్‌ నుంచి 167వ నేషనల్ హైవేకు కొత్త కనెక్టివిటీ

1 hour ago 1
హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగు రోడ్డు, జాతీయ రహదారులతో అనుసంధానించేందుకు మరో కీలక రహదారి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. బుద్వేల్‌ నుంచి టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాల మీదుగా నాచారం వద్ద 167వ జాతీయ రహదారి వరకు సుమారు 81 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రేడియల్‌ రోడ్డు-2 నిర్మించనున్నారు. మూడు ప్యాకేజీలుగా చేపట్టే ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.5 వేల కోట్ల వ్యయం కానుంది. శంషాబాద్‌, షాబాద్‌, పూడూరు, పరిగి, కోస్గి తదితర ప్రాంతాల మీదుగా రహదారి సాగనుంది. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 30లోపు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంది.
Read Entire Article