మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్ కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీలో ఉన్న చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో 4 వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. దాని విలువ సుమారు రూ.30 కోట్లుగా అంచనా. 1985లో లేఔట్ వేసిన భూ యజమానుల కుటుంబసభ్యులే తప్పుడు పత్రాలతో స్థలాన్ని అమ్మినట్లు దర్యాప్తులో తేలింది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాలపై అధికారులు పరిశీలించి, భూమి పార్కుగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ఆక్రమణలను తొలగించి, ఫెన్సింగ్‌తో హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా కొనసాగిన వివాదం పరిష్కారమవడంతో కాలనీ నివాసులు సంతోషం వ్యక్తం చేశారు.